నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నాయని కుంట తండా గ్రామస్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు తండా వాసులపై అక్రమ కేసులు పెట్టి... వారికి ఇష్టం వచ్చినట్లు డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
అక్రమ కేసులను నిరసిస్తూ గ్రామస్థుల ధర్నా - formers protest at peddavura
విద్యుత్ శాఖ అధికారులు పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ.... పెద్దవూర మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నాయని కుంట తండా వాసులు ఆందోళన చేపట్టారు. గిరిజనులపై అక్రమ విద్యుత్ వినియోగం కేసులు పెట్టి వేధిస్తోన్నారని ఆరోపించారు.

అక్రమ కేసులను నిరసిస్తూ గ్రామస్థుల ధర్నా
తమ పై పెట్టిన కేసులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా చుస్తామన్న పోలీసుల భరోసాతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
అక్రమ కేసులను నిరసిస్తూ గ్రామస్థుల ధర్నా
ఇదీ చూడండి:క్వారంటైన్ సెంటర్లను సందర్శించేందుకు ప్రజలు రావద్దు