తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటరు చైతన్యం కోసం 5కె రన్​ - fit india foundation

నల్గొండ జిల్లాలో జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఓటరు చైతన్యం కోసం 5కె రన్​ ప్రారంభించి విజేతలకు బహుమతులు అందజేశారు.

National Voter's Day was celebrated in Nalgonda district
ఓటరు చైతన్యం కోసం 5కె రన్​

By

Published : Jan 25, 2021, 11:24 AM IST

యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని ఫిట్ ఇండియా ఫౌండేషన్ కోరింది. జాతీయ ఓటరు దినోత్సవంను పురస్కరించుకుని.. నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం ముకుందాపురంలో 5కె రన్​ ఏర్పాటు చేసింది.

జాతీయ జెండా ఊపి..

ఈ కార్యక్రమంలో హాలియా సీఐ వీరరాఘవులు హాజరై జాతీయ జెండా ఊపి పరుగు పందెం ప్రారంభించారు. ఓటరు చైతన్యం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొంది. ముకుందా పురం హైస్కూల్ నుంచి తుమ్మడం కోట మైసమ్మ ఆలయం వరకు.. తిరిగి స్కూల్ వరకు పరుగు పూర్తి చేసిన 10 మందికి బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి:ప్రేమోన్మాదం పెచ్చుమీరుతోంది... కపట నాటకంతో కత్తిదూస్తోంది!

ABOUT THE AUTHOR

...view details