తెలంగాణ

telangana

ETV Bharat / state

Nalgonda Woman SI Success Story : తల్లిదండ్రుల కష్టం.. తనయ విజయం.. ఎస్‌ఐ కొలువు సాధించిన పేదింటి యువతి - తెలంగాణ ఎస్ఐ స్టోరీస్‌

Nalgonda Woman SI Success Story : తల్లిదండ్రులు దినసరి కూలీలు. సమాజం బాధలు పడలేక.. కుమార్తె పెళ్లి చేసి బరువు దించేసుకోవాలనే మధ్యతరగతి ఆలోచనలు వారివి. ఆ అడ్డంకులన్నింటినీ దాటి సబ్‌ ఇన్‌స్పెక్టర్ కొలువు సాధించింది ఆ యువతి. తనను తాను నిరూపించుకుంటానని కన్నోళ్లకు మాటిచ్చి, శ్రమించింది. ఫలితంగా ఇటీవల విడుదలైన ఎస్‌ఐ ఫలితాల్లో మెరిసింది. మరి, అడ్డంకులను దాటి ఎస్ఐగా ఎలా ఎదిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.

Woman SI Success Story
TS Woman SI Success Story

By

Published : Aug 16, 2023, 12:14 PM IST

TS Woman SI Success Story ఎస్‌ఐ కొలువును సాధించిన పేదింటి యువతి

Nalgonda Woman SI Success Story:పుట్టింది పేదరికంలో. చిన్ననాడే ఉన్న ఊరు విడిచి కుటుంబం వలస వెళ్లింది. కానీ పిల్లలకు తాము ఇవ్వగలిగేది చదువు మాత్రమే అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. వారి కష్టమే ఈ యువతిని నిత్యం లక్ష్యం దిశగా నడిపింది. ఫలితంగా ఈ యువతి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కొలువు సాధించి కన్నవారి ఆనందానికి కారణమయ్యానని గర్వంగా చెబుతోంది.

TS Woman SI Success Story :ఈ యువతి పేరు మిడిదొడ్డి మనీషా. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన యువతి. తల్లిదండ్రులు ఆండాలు, రాజయ్య దినసరి కూలీలు. బాల్యం నుంచి చదువులో ముందుండేది మనీషా. చిన్నప్పుడే కుటుంబం స్వస్థలం నుంచి ఖమ్మంకు వలస వెళ్లారు. సెకండరీ విద్య ఖమ్మంలోని ప్రైవేటు పాఠశాలలో పూర్తి చేసి, ఇంటర్‌ వరంగల్‌లో, డిగ్రీ కోఠి ఉమెన్స్‌కాలేజ్‌లో పూర్తి చేసింది. ఆ సమయంలోనే కొవిడ్‌ రావడం, అందరూ చదువు పూర్తైంది కదా పెళ్లి చేసుకో అనడంతో కచ్చితంగా చదువుకి సరిపడా ఉద్యోగం సాధించాలనేపట్టుదలతో చదివింది. ఫలితంగా 245 మార్కులతో ఎస్‌ఐ (SI Results) ఉద్యోగాన్ని సాధించింది. ప్రతి ఇంట్లో అబ్బాయికి ఉన్న విలువ అమ్మాయికీ ఉండాలంటోంది మనీషా. అబ్బాయి చదువు పూర్తయ్యాక సెటిల్ అయ్యేందుకు చాలా సమయం ఇస్తారు. అమ్మాయిల విషయంలో ఎందుకీ పక్షపాత ధోరణి అంటోంది? అమ్మాయిలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారంటోంది.

"మా తల్లిదండ్రుల కళ్లలో ఏం చుడాలి అనుకున్నానో ఇప్పుడు అది నేను చూస్తున్నాను. వాళ్లు దొరికిన పని చేసి మమ్మల్ని చదివించారు. అందరి తల్లిదండ్రుల్లా ఆలోచించకుండా నాపై నమ్మకం ఉంచి నన్ను చదివించారు. మనపై మనకి ముందుగా నమ్మకం ఉండాలి అప్పుడే ఎదుటివారు ఏం అన్నా అనుకున్నది సాధించగలం. ఇప్పటి యువతకి నేనిచ్చే సలహా ఏంటి అంటే మనం ఒక స్థాయిలో స్థిరపడ్డాకే పెళ్లి ఇలాంటివి ఆలోచించండి." - మనీషా, ఎస్‌.ఐ విజేత

Success Story of SI Manisha :పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో అందరూ ఒకేలా చదవలేరని అంటోంది మనీషా. ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలని చెబుతోంది. తన విషయంలో ఏ రోజు సిలబస్‌ ఆ రోజు పూర్తి చేశాకే నిద్రపోయేదాన్ని అంటోంది. కోచింగ్‌ తీసకునే సమయంలో మిత్రులు చాలా ప్రోత్సాహం అందించారని చెబుతోంది. ఆడపిల్లకు(Women Empowerment) ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని కాక ఇష్టమున్న రంగంలో ప్రోత్సహించాలని అంటున్నారు మనీషా తల్లిదండ్రులు. హమాలీ, మేస్త్రీ పనులు చేసి తన కుమార్తెను చదివించానని, ఇప్పుడిక కష్టాలన్నీ తీరపోతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Nainika Thanaya You Tube Channel : అదిరిపోయే స్టెప్పులతో ఫిదా చేస్తున్న అమెరికాలో ఉంటున్న ఓరుగల్లు అక్కాచెల్లెళ్లు

Vogue Italia : వోగ్‌ ఇటాలియాలో 'మనోళ్ల బొమ్మ'.. సరదాగా తీసిన ఫొటోకు గుర్తింపు

Special Story On Dundigal AIR Force Academy : 'దేశ సేవ చేయడమే మా అంతిమ లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details