అత్యవసరంగా వచ్చే అంబులెన్స్‌లను ఆపవద్దని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ అధికారులకు తెలిపారు. దామరచెర్ల మండలం వాడపల్లి చెక్ పోస్ట్‌ను ఆయన పరిశీలించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద రాకపోకలపై అధికారులకు తగిన సూచనలు చేశారు.
"అత్యవసరంగా వచ్చే అంబులెన్సులను ఆపవద్దు' - nalgonda latest corona NEWS
అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద రాకపోకలను నిలిపి వేసి లాక్ డౌన్‌ను కచ్చితంగా అమలు చేస్తున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ వాడపల్లి చెక్ పోస్ట్‌ను పరిశీలించారు. అత్యవసరంగా వచ్చే అంబులెన్సులను అనుమతించాలని ఆదేశించారు.
నల్గొండ లో ఎస్పీ తనిఖీలు
సరైన పత్రాలను చూపించిన వాహనాలను అనుమతించాలని ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. వాహనదారులతో దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. అత్యవసరంగా వెళ్లే వారిని అనుమతించాలని తెలిపారు.
ఇదీ చూడండి: కొవిడ్ రోగులను నిలిపివేయడం బాధాకరం: ఏపీ ప్రభుత్వ విప్