నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద నెలకొన్న పరిస్థితులను ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు. వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా... కొంతమంది ఆంధ్రా వాసులు తమ సొంత వాహనాలలో వాడపల్లి చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు.
'అనుమతి పత్రాలు ఇచ్చాకే ఏపీకి పంపండి' - LOCK DOWN UPDATES
తెలంగాణ చెక్‌పోస్టులు అనుమతించినా.... ఏపీ అధికారులు తిప్పి పంపిస్తున్న దృష్ట్యా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్‌పోస్టును ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు. వైద్యులకు, పోలీసులకు పలు సూచనలిచ్చారు.
'అనుమతి పత్రాలు ఇచ్చాకే ఏపీకి పంపండి'
తెలంగాణ అధికారులు అనుమతులు ఇచ్చినా.... ఆంధ్రప్రదేశ్ చెక్‌పోస్ట్ వద్ద వారిని తిప్పి పంపారు. ఈ ఘటన దృష్ట్యా... ఎస్పీ చెక్‌పోస్ట్‌ను పరిశీలించారు. పోలీస్ వారికి, వైద్య సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. చెక్‌పోస్టు వద్దకు వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి... అనుమతి పత్రాలు ఇచ్చిన తర్వాతనే ఏపీ పంపాలని అధికారులకు సూచించారు.