నల్గొండ జిల్లా అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్, నాంపల్లికి చెందిన ఎండీ గౌస్.. నేరెళ్ల గ్రామానికి చెందిన సద్దాం అనే యువకుడిని హత్య చేసి.. తలను శరీరం నుంచి వేరు చేశారు. తల తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. వీరికి సోదరి వరసయ్యే ఓ మహిళను సద్దాం చంపేశాడనే అనుమానంతోనే అతని హతమార్చారు.
అసలేం జరిగిందంటే...
ఇర్ఫాన్, గౌస్‌కు సోదరి వరసయ్యే ఓ మహిళకు అంతకు ముందే వేరే వ్యక్తితో పెళ్లయ్యింది. కానీ భర్త చనిపోయాడు. ఆటో డ్రైవర్‌గా పని చేసే సద్దాం ఆమెకు దగ్గరయ్యాడు. అనంతరం ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి సహజీవనం ప్రారంభించాడు. 2017లో ఆమె అనుమానాస్పద రీతిలో ప్రాణాలు వదిలింది. తమ సోదరి చనిపోవడానికి సద్దామే కారణమని ఇర్ఫాన్, గౌస్ బలంగా నమ్మారు.