తమ మనోభావాలు కించపరిచేలా మర్డర్ సినిమా తీస్తున్నారంటూ దర్శకుడు రాంగోపాల్వర్మపై... ప్రణయ్ భార్య అమృత దాఖలు చేసిన పిటిషన్పై నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ చేపట్టింది. మర్డర్ సినిమాను ఆపాలని గత నెలలో అమృత పిటిషన్ వేసింది. పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువురి వాదనలు విని తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.
'మర్డర్' సినిమాపై విచారణ వాయిదా - రాంగోపాల్పై అమృత కేసు
మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా మర్డర్ సినిమా తీస్తున్నారని ఆరోపిస్తూ... దర్శకుడు రాంగోపాల్ వర్మపై దాఖలైన పిటిషన్పై జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. తమ మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రణయ్ భార్య అమృత జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
'మర్డర్' సినిమాపై అమృత దాఖలుచేసిన పిటిషన్పై విచారణ వాయిదా
దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనా పాజిటివ్ రావడం వల్ల కోర్టుకు రాలేరని... అందువల్ల గడువు ఇవ్వాలని రాంగోపాల్ వర్మ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కానీ రాంగోపాల్ వర్మకు కరోనా సోకలేదని.. తప్పించుకోవడానికే అసత్యం చెబుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు.
ఇవీ చూడండి: కుంగుతున్న కాలువలు... వృథాగా పోతున్న నీరు