ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ 29 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండలో 17, సూర్యాపేటలో 7, యాదాద్రి జిల్లాలో 5 నిర్ధరణ అయ్యాయి.
నల్గొండ జిల్లా....
నల్గొండలో 17 కేసులు నమోదయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 10 మందికి కొవిడ్ నిర్ధరణ కాగ, మిర్యాలగూడలో నలుగురు, నకిరేకల్‌లో ఇద్దరు, నార్కట్‌పల్లి మండలంలో ఒకరు కరోనా వైరస్ బారిన పడినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 145కు చేరగా... ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 120 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 426 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.