Uttam on KCR: రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఇష్టమొచ్చిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు నాలుగైదు శాఖలు కేటాయించడం.. నచ్చనివాళ్లను పక్కన పెట్టేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించకపోవడంపై ఉత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థను కేసీఆర్ అవమానపరుస్తున్నారని మండిపడ్డారు.
అన్ని వ్యవస్థలనూ కేసీఆర్ నాశనం చేశారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - తెలంగాణ కాంగ్రెస్ వార్తలు
Uttam on KCR: బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించకపోవడంపై ఉత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థను కేసీఆర్ అవమానపరుస్తున్నారని మండిపడ్డారు.

uttam kumar reddy
అన్ని వ్యవస్థలనూ కేసీఆర్ నాశనం చేశారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
'బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం సరైన సాంప్రదాయం కాదు. ఇలాంటి వ్యవహార శైలి ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు. ఇష్టమొచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నాలుగైదు శాఖలు కట్టబెట్టడం.. నిజాయతీగా పనిచేసేవాళ్లను పక్కన పెట్టడం సరైంది కాదు.' - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్గొండ ఎంపీ
ఇదీచూడండి:'కేసీఆర్ మూలాలు బిహార్‌లో ఉన్నాయ్.. అందుకే వారికే కీలక పోస్టింగులు'