తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండలో ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్​ - nalgonda

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడోవిడత ప్రాదేశిక పోలింగ్​ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మూడు జిల్లాల్లో 85 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి.  అధికార ప్రతిపక్షపార్టీలకు బలమైన కేడర్ ​ఉన్న నల్గొండలో పలుచోట్ల ఇరుపార్టీల వర్గాలు బాహాబాహీకి దిగారు. తొలివిడతలో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

nalgonda-mlc-election

By

Published : May 15, 2019, 5:04 AM IST

Updated : May 15, 2019, 8:00 AM IST

ఉమ్మడి నల్గొండ మూడు విడతల్లో జరిగిన ప్రాదేశిక పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. మూడు జిల్లాల వ్యాప్తంగా 85 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. నల్గొండలో 85.50శాతం.. సూర్యాపేట జిల్లాలో 85.04 శాతం ఓట్లు పోలవ్వగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 88.40 శాతం పోలింగ్​ నమోదైంది. తుది విడతలో 25 జడ్పీటీసీ, 275 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

పలుచోట్ల ఉద్రిక్తం

ఎన్నికల రీత్యా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నల్గొండజిల్లా చిట్యాల మండలం నేరడలో డబ్బులు పంచుతున్నారంటూ అర్ధరాత్రి సమయంలో అధికార, ప్రతిపక్షపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. నార్కట్​పల్లి మండలం మాండ్రలో ప్రచార విషయంలో గొడవ జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మర్యాల పోలింగ్​ కేంద్రంలో భాజపా, తెరాస అభ్యర్థుల మధ్య వాగ్వాదం జరిగింది.
పరస్పర దాడులు
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్​లో తెరాస, కాంగ్రెస్​ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. ఒకరిపై ఒకళ్లు రాళ్లు రువ్వుకుంటూ, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. మఠంపల్లి, రఘునాథపాలెంలోనూ ప్రచారం విషయంలో కార్యకర్తల మధ్య ఘర్షణ జరగ్గా పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కడా పరిస్థితి చేయిదాటిపోకుండా అదుపు చేశారు.

నల్గొండలో ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్​

ఇదీ చదవండి: పోలింగ్​ కేంద్రం వద్ద తెరాస, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ

Last Updated : May 15, 2019, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details