Nalgonda MLA Komati Reddy Venkat Reddy Profile :తెలంగాణ కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకుల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతున్నా, తోటి నాయకులు తమ స్వార్థం కోసం పార్టీ మారుతున్నా ఎన్నడూ తన విధేయతను చెదరనీయక కోమటి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారిందంటే దాని వెనకాల కోమటి రెడ్డి కృషి ఎంతో ఉందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర నాయకుడుగా ఎదిగిన కోమటిరెడ్డి జీవితం ఎందరికో ఆదర్శం.
Nalgonda MLA Komati Reddy Venkat Reddy Life Story : కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల గ్రామం. ఆయన 23 మే 1963న సుశీలమ్మ, పాపిరెడ్డి దంపతులకు 8వ సంతానంగా జన్మించారు. వీరిది వ్యవసాయ(Agriculture) ఆధారిత కుటుంబం. వెంకట్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి అనే తమ్ముడు కూడా ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 1980లో హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు హైస్కూల్‌లో పదవ తరగతి చదివారు. తరువాత అతను పాతర్‌గట్టి ఎన్బీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉన్న కోమటిరెడ్డి హైదరాబాద్‌లో ఉన్న ప్రఖ్యాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో బ్యాచిలర్స్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ అభ్యసించారు. కానీ పలు అనివార్య కారణాల వల్ల ఇంజినీరింగ్ పూర్తి చేయలేకపోయారు.
నల్గొండలో అంతుచిక్కని రాజకీయం-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ కంచర్ల భూపాల్‌రెడ్డి
ఇంజినీరింగ్ చదువుతున్న కాలంలోనే కోమటిరెడ్డి రాజకీయాలకు ఆకర్షితుడయ్యాడు. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకుని యూత్ కాంగ్రెస్‌లో చేరారు. కాలేజీలో ఉన్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. అప్పుడే లక్ష్మీ అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు ప్రతీక్ రెడ్డి, కుమార్తె శ్రీనిధి. కుమారుడు 20 డిసెంబర్ 2011న హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదానికి గురై చనిపోయాడు.
తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్‌ని స్థాపించారు. ఫౌండేషన్ ద్వారా రూ. 3.5 కోట్ల వ్యయంతో, అతను నల్గొండలో ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒకేషనల్ జూనియర్ కళాశాల భవనాన్ని నల్గొండలో చేపట్టారు. అతను ఈ సంస్థ క్రింద అంబులెన్స్ సేవలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తన కుమారుడులా ఎవరురోడ్డు ప్రమాదాలకు గురవుకూడదని, రహదారి భద్రత(Road safety) కోసం అవగాహన ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ జాబ్ మేళాను నిర్వహించి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నారు.
Komati Reddy Venkat Reddy Political Journey : నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికతో కోమటిరెడ్డి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా నాటి టీడీపీ ప్రభుత్వ తప్పిదాలపై పోరాడారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కోమటి రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సమీప సీపీఎం అభ్యర్థి నంద్యాల నరసింహా రెడ్డిపై 4000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పటివరకు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నల్గొండను కాంగ్రెస్ అడ్డాగా మార్చడంలో కోమటి రెడ్డి కీలక పాత్ర పోషించారు.
పార్టీ ఫిరాయించిన 12 మందికి - ఈ ఎన్నికల్లో కార్యకర్తలు బుద్ధి చెప్పాలి : రేవంత్ రెడ్డి
అటు పార్టీని పటిష్ఠం చేస్తూనే తనదైన స్టైల్లో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు. దీంతో మరల 2004 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కోమటిరెడ్డి విజయం నల్లేరుపై నడకయ్యింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డిపై 22000 భారీ మెజారిటీతో విజయపంథాలో దూసుకుపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేశారు.
Komati Reddy Venkata Reddy is Congress Candidate in Nalgonda :నల్గొండను దశాబ్దాలుగా పట్టిపీడుస్తున్న తాగునీటి సమస్య పోవడానికి ఊరూరా శుద్ధనీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలన్నీ పేదలకు అందేలా తనవంతు కృషి చేశారు. ఈ దెబ్బకు 2009వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం(Hattrick Win) కైవసం చేసుకున్నారు. ఈ పోరులో మరల తన సమీప ప్రత్యర్థిగా సీపీఎం అభ్యర్థి నంద్యాల నరసింహా రెడ్డిపై గెలుపు బావుటా ఎగురవేశారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందటంతో కోమటిరెడ్డికి మంత్రి పదవి వరించింది.