Nalgonda IT Hub :రాష్ట్రంలో ఐటీ(IT Sector) రంగాన్ని హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా వ్యాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఒకప్పుడు ఐటీ జాబ్చేయాలంటే హైదరాబాద్, చెన్నై, నోయిడా, దిల్లీ, బెంగళూరు, ముంబయి వంటి నగరాల వైపే చూసేవారు. కానీ ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించే దిశగా రాష్ట్ర సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది.
Nalgonda IT Tower :ఇప్పటి వరకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల్లో ఐటీ హబ్నిర్మించారు. తర్వాత దశలో మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేటలతో పాటు నల్గొండకు ఐటీ హబ్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేటలలో ఐటీ టవర్లు ప్రారంభమయ్యాయి. వాటిలో ఐటీ కార్యకలాపాలు కూడా షురూ అయిన విషయం తెలిసిందే. ఇక నల్గొండ ఐటీ హబ్‌ను ప్రకటించిన వెంటనే పనులు మొదలు పెట్టారు. 2021 డిసెంబర్ 28న సీఎం కేసీఆర్ నల్గొండ సందర్శించిన సందర్భంగా అభివృద్ధిపై సమీక్షిస్తూ.. అభివృద్ధి పనులతో పాటు ఐటీ హబ్(Nalgonda IT Hub)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
KTR To Inaugurate Nalgonda IT Hub in September : ఆ వెంటనే జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో గల పాలిటెక్నిక్ కాలేజీ స్థలాన్ని ఐటీ హబ్నిర్మాణానికి కేటాయించారు. అదే ఏడాది ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) నల్గొండ పర్యటనకు వచ్చిన సందర్భంగా.. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి ఐటీ హబ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఐటీ హబ్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావడంతో సెప్టెంబర్ రెండో వారంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నద్ధం చేస్తున్నారు.
Siddipet IT Tower Inauguration : సిద్దిపేట సిగలో మరో మణిహారం.. రేపే ఐటీ హబ్ ప్రారంభం