నల్గొండజిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులోని శ్రీ దుర్గా వైన్స్‌లో జనవరి 15 రోజు రాత్రి గోడను పగులగొట్టి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సుమారు నాలుగు లక్షల పైగా విలువైన మద్యం బాటిళ్లను దొంగలించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి 90శాతం సొమ్మును రికవరీ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
మద్యం దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు - nalgonda dsp venkateswar reddy pressmeet
వైన్స్ షాప్ గోడ పగుల గొట్టి మద్యం దొంగిలించిన కేటుగాళ్ల భరతం పట్టారు నల్గొండ పోలీసులు. అరెస్టు చేసి మద్యం బాటిళ్లను రికవరీ చేశారు. దుండగులను రిమాండ్‌కు తరలించారు.
మద్యం దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు
గతంలో కూడా వీరిపై చాలా కేసులు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులు మల్లేపల్లి మండలం, గుమ్మదవెల్లికి గ్రామానికి చెందిన మారం వెంకట్ రెడ్డి, సత్తరసాల కొండలుగా గుర్తించి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.
Last Updated : Mar 6, 2020, 9:31 PM IST
TAGGED:
వైన్‌షాప్‌లో దొంగతనం