నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు, తెరాస కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల క్షేమం కోరుతూ రుణమాఫీ, రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేయటం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.
మిర్యాలగూడలో రైతు బాంధవుడికి పాలాభిషేకం - Miryalaguda farmers Palabhishekam to KCR image
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెరాస ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మిర్యాలగూడలో రైతు బాంధవుడికి పాలాభిషేకం
తెరాస ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందని నాయకులు పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు.