Corona Cases in Kasturba school: నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము కస్తుర్బా పాఠశాలలో కరోనా కలకలం కరోనా కలకలం రేపింది. ఉదయం విద్యార్థులు జ్వరం, దగ్గుతో బాధ పడుతుండటంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వైద్య శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో వైద్య సిబ్బంది కస్తూర్బా పాఠశాలకు వచ్చి 20మంది విద్యార్థినులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 16మంది విద్యార్థినులకు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Corona Cases in Nalgonda : కస్తుర్బా పాఠశాలలో కరోనా కలకలం .. మరో 17 మందికి పాజిటివ్
13:33 August 04
Corona Cases in Nalgonda : నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము కస్తుర్బా పాఠశాలలో కరోనా కలకలం
దీంతో ప్రిన్సిపల్ గీత విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. ప్రస్తుతం నేరేడుగొమ్ము కస్తుర్బా పాఠశాల దేవరకొండలో కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న తాజాగా 992 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,22,663కు పెరిగింది. హైదరాబాద్‌లో 376కేసులు నమోదయ్యాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఇవీ చదవండి:జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం.. వాటిపైనే ప్రధానంగా చర్చ..!
'కొవిడ్ టీకా ఓ ఫెయిల్యూర్'.. బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు