తెలంగాణ

telangana

'బేషరతుగా ఉత్తమ్​కు మంత్రి జగదీశ్ క్షమాపణ చెప్పాలి'

By

Published : Jun 1, 2020, 7:54 PM IST

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీసీసీ ఆధ్వర్యంలో మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

'బేషరతుగా ఉత్తమ్​కు మంత్రి జగదీశ్ క్షమాపణ చెప్పాలి'
'బేషరతుగా ఉత్తమ్​కు మంత్రి జగదీశ్ క్షమాపణ చెప్పాలి'

నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియంత్రిత సాగు విధానంపై జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డీసీసీ డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

రైతు ఋణ మాఫీపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీసినందుకు సహనం కోల్పోయిన మంత్రి.. సమాధానం చెప్పలేక ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై డీసీసీ మండిపడింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశామన్నారు. బేషరతుగా మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని జిల్లా పార్టీ డిమాండ్ చేసింది.

మాజీ సైనికుడిని అవమానించారు...

గతంలో దేశం కోసం రక్షణ శాఖలో సైనికుడిగా పని చేసిన ఉత్తమ్​ను కనీస గౌరవం లేకుండా మంత్రి దూషించారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హుందాగా ప్రవర్తించాల్సిన మంత్రి వీధి రౌడీలాగా ప్రవర్తించడం హేయమైన చర్యగా వెంకన్న యాదవ్ అభివర్ణించారు.

రైతులకు పూర్తి స్థాయిలో ఋణ మాఫీ జరగలేదని.. రైతులకు మేలు జరిగే వరకు కాంగ్రెస్ రైతుల పక్షానే కొట్లాడుతుందన్నారు. మంత్రి తన వైఖరి మార్చుకోకపోతే త్వరలోనే ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఇవీ చూడండి : లెక్కలు అడిగితే మంత్రికి కోపం వస్తోంది: ఉత్తమ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details