కరోనా వైరస్ వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అన్ని జిల్లాల పాలనాధికారులు, ఎస్పీలతో.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు.
కరోనా వ్యాప్తి నివారణకు ముందస్తు చర్యలు - కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మీడియా సమావేశం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. పాఠశాలలు మాసివేయాలని, మద్యం దుకాణాల్లో పర్మిట్ గదులు, సినిమా థియేటర్లపై కొన్ని రోజులపాటు ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో అనుమతి గదులు, ఫంక్షన్ హాళ్లు, సినిమా థియేటర్లు, తదితర వాటిపై కొన్ని రోజులు ఆంక్షలు విధించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో వివిధ దేశాలనుంచి జిల్లాకు వచ్చిన 51 మంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులను నియమించినట్లు తెలిపారు. వైరస్ గురించి ఎలాంటి సమాచారం కావాలన్నా టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో జేసీ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ రంగనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:142 సంవత్సరాల్లో మొదటిసారి మూసివేత..!