విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడిలో ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులకు సౌకర్యాలు కల్పిస్తూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిజమైన నిర్వచనం ఇస్తున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు. కొడుకుపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన కొండాపురం గ్రామానికి చెందిన కురిమిళ్ల లక్ష్మమ్మ అనే వృద్ధురాలు గమనించిన హోం గార్డు రమేశ్ ఆమె వివరాలను కనుక్కున్నాడు. రాత్రి నుంచి ఏమి తినలేదని తెలుసుకుని అల్పాహారం తెచ్చి తానే స్వయంగా తినిపించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించి సామాజిక మధ్యమాల్లో పోస్టు చేశారు.
మానవత్వాన్ని చాటుకున్న హోంగార్డు - మానవత్వాన్ని చాటుకున్న చుండూరు పోలీస్ స్టేషన్ హోంగార్డు
విధి నిర్వహణలో కఠినత్వాన్నే కాదు మానవత్వాన్ని ప్రదర్శిస్తూ.. అందరి మన్ననలు పొందుతున్నారు నల్గొండ జిల్లా పోలీసులు. తాజాగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వృద్ధురాలి ఆకలి తీర్చిన చండూరు పోలీస్ స్టేషన్ హోం గార్డు రమేష్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మానవత్వాన్ని చాటుకున్న హోంగార్డు
హోంగార్డు దృశ్యాలకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఆయన ప్రదర్శించిన మానవత్వం పట్ల అభినందనలు తెలుపుతూ శభాష్ తెలంగాణ పోలీస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. హోమ్ గార్డు చూపిన చొరవ, మానవత్వం పట్ల డీఐజీ ఏ.వి. రంగనాథ్, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి:విద్యార్థుల ముందే ప్రధానోపాధ్యాయుడిపై దాడి