నల్గొండ పార్లమెంటరీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 19 రౌండ్లు ముగిసేసరికి 22 వేల 884 ఓట్ల ఆధిక్యంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ప్రారంభంలో తెరాస నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డి తొలిస్థానంలో నిలిచినా... తరువాత పరిస్థితి మారింది. అనూహ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. ఉత్తమ్ ఇప్పటికే హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆధిక్యంలో కొనసాగుతోన్న ఉత్తమ్ - congress
నల్గొండ లోక్‌సభ స్థానంలో ఓట్ల లెక్కింపులో హస్తం పార్టీ దూసుకుపోతోంది. 19 రౌండ్లు ముగిసేసరికి 22 వేల 884 ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందంజలో ఉన్నారు.
ఆధిక్యంలో కొనసాగుతోన్న ఉత్తమ్
Last Updated : May 23, 2019, 2:33 PM IST