తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీ ప్రభుత్వం కార్పోరేట్​ రంగానికే అనుకూలం: కాంగ్రెస్​

మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీలకే అనుకూలంగా వ్యవహరిస్తోందని నల్గొండ జిల్లా కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్​ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు.

nalgonda  congress president allegation on  modi government favors the corporate sector
మోదీ ప్రభుత్వం కార్పోరేట్​ రంగానికే అనుకూలం: కాంగ్రెస్​

By

Published : Jan 11, 2021, 8:37 PM IST

దిల్లీ సరిహద్దు ప్రాంతంలో 50 రోజులుగా రైతులు ఆందోళన చేస్తోంటే కేంద్రం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందని నల్గొండ జిల్లా కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్​ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు.

మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీ లాంటి కార్పోరేట్​ వారికి మాత్రమే అనుకూలంగా ఉందని శంకర్​ నాయక్​ అన్నారు. వ్యవసాయం కార్పోరేట్​ పరమైతే పంటకు మద్దతు ధర లభించక చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి:పంచుకుంటున్నారా.. తెంచుకుంటున్నారా!?

ABOUT THE AUTHOR

...view details