భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయ సాధనకు తాము కృషి చేస్తున్నట్లు డీసీసీబీ అధ్యక్షుడు శంకర్ నాయక్ తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి వేడుకలను నల్గొండలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పానగల్ బైపాస్ వద్ద ఉన్న ఇందిర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధానిగా దేశానికి ఉత్తమ సేవలందించి... ధీరవనిత, ఉక్కు మహిళగా పేరు సంపాదించుకున్నారని కొనియాడారు.
'ఇందిర ఆశయ సాధన కోసం పాటుపడుతున్నాం'
నల్గొండ జిల్లా పానగల్‌లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరిపారు. ఇందిర ఆశయాలకు అనుగుణంగా తాము పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదల కోసం పాటు పడిన ఉక్కుమహిళ అని కొనియాడారు. ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు.
'ఇందిర ఆశయ సాధన కోసం పాటుపడుతున్నాం'
20 సూత్రాల పథకం తీసుకొచ్చి పేదలకు మేలు చేశారని... వారి శ్రేయస్సు కోసం ఎంతో పాటు పడ్డారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మాల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఇందిరా గాంధీకి మోదీ, రాహుల్ నివాళులు