'కరెంట్ కోత, డీజిల్ కొరత' పేరుతో ఈనాడులో వచ్చిన వార్తకు స్పందన లభించింది. నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో సమస్యలపై సోమవారం నాడు ప్రచురితమైన కథనానికి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి స్పందించారు.
ఈనాడు కథనానికి స్పందించిన కలెక్టర్, ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్, ఎమ్మెల్యే సందర్శించారు. ఈనాడులో ప్రచురితమైన కథనానికి స్పందించి, ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈనాడు కథనానికి స్పందించిన కలెక్టర్, ఎమ్మెల్యే
ఆసుపత్రిలోని పలు వార్డుల్లోని సమస్యలపై ఈనాడు కొంతకాలంగా కథనాలు ప్రచురిస్తోంది. ఇవాళ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. డయాలసిస్ వార్డులో బెడ్స్, కరెంట్, డీజిల్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి!