తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఏఏ, ఎన్​ఆర్సీల వల్ల ప్రజలకు కలిగే నష్టమేంటి?' - నల్గొండ జిల్లా

సీఏఏ, ఎన్​ఆర్సీలపై ప్రభుత్వం ప్రకటించిన వ్యతిరేక తీర్మానాన్ని నల్గొండ జిల్లా భాజపా అధ్యక్షుడు నూకల నర్సింహరెడ్డి విమర్శించారు. ఈ చట్టాల వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగే నష్టమేంటని కేసీఆర్​ను ప్రశ్నించారు.

'సీఏఏ, ఎన్​ఆర్సీల వల్ల ప్రజలకు కలిగే నష్టమేంటి'
'సీఏఏ, ఎన్​ఆర్సీల వల్ల ప్రజలకు కలిగే నష్టమేంటి'

By

Published : Mar 18, 2020, 7:57 PM IST

పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ), జాతీయ పౌరసత్వం రిజిస్టర్ (ఎన్​ఆర్సీ)లపై ప్రభుత్వం వ్యతిరేక తీర్మానం ప్రకటించడాన్ని నల్గొండ జిల్లా భాజపా అధ్యక్షుడు నూకల నర్సింహరెడ్డి తప్పుబట్టారు. ఈ చట్టాల వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగే నష్టమేంటని ముఖ్యమంత్రి కేసీఆర్​ను ప్రశ్నించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చి మనదేశంలో స్థిరపడ్డవారిని తిరిగి పంపించే చట్టాలను వ్యతిరేకించడం తగదన్నారు.

కొన్ని పార్టీలకు, మైనార్టీలకు భయపడి కేసీఆర్​.. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని నర్సింహరెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి, పార్లమెంట్​ ఆమోదించిన బిల్లులను విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని తెలిపారు.

'సీఏఏ, ఎన్​ఆర్సీల వల్ల ప్రజలకు కలిగే నష్టమేంటి'

ఇదీ చూడండి:అక్కడ చిక్కుకున్న విద్యార్థులను కాపాడండి: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details