Nalgonda Accidents Today 2023 :ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రోడ్డు యాక్సిడెంట్లో తమ కుటుంబ సభ్యుడు మరణించాడని తెలుసుకున్న ఆ కుటుంబం అతడి కోసం టాటాఏస్ వాహనంలో బయలుదేరింది. ఇంతలో విధి వారిని చిన్న చూపు చూసింది. అక్కడికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో ఆయిల్ ట్యాంకర్ వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ కుటుంబంలోని నలుగురు దుర్మరణం చెందారు. ఒకే రోజు రెండు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడం నల్గొండ జిల్లాలో విషాదం నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :నల్గొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితోపాటు మరో వ్యక్తి మరణించాడు. ఆదివారం అర్ధరాత్రి నిడ్మనూరు మండలం శాఖాపాలెం వద్ద పాదచారిని బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మరణించారు. పెద్దవూర మండలం నిమ్మనాయక్ తండాకు చెందిన కేశవులు (28) గుంటూరులో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
శ్రీశైలం పుణ్యక్షేత్రం వెళ్లాలని నిర్ణయించుకున్న కేశవులు గుంటూరు నుంచి మొదట నల్గొండ జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున గుంటూరు నుంచి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. వేంపాడు స్టేజి వద్దకు వచ్చేసరికి రాత్రి అయింది. ఈ క్రమంలో ఓవైపు పొగమంచు మరోవైపు రాత్రి సమయం కావడంతో రహదారి కనిపించక అటుగా వస్తున్న సైదులు (55) అనే పాదచారిని కేశవులు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
"రాత్రి సౌండ్ రాగానే వచ్చి చూశాం. యాక్సిడెంట్ అయింది. చూసేసరికి బండి పడి ఉంది. వాళ్లు ఊళ్లో వాళ్లకి సమాచారం అందించాం. బండిలో ఉన్న ఇద్దరిని బయటకు తీశాం అప్పటికే ఇద్దరు చనిపోయారు. మిగతావారిని తీస్తూ పోలీసులకు సమాచారం అందించాం. అంబులెన్సులు వచ్చాయి. గాయపడినవారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి పంపించాం." - స్థానికులు