శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సాగర్‌కు ఇన్ ఫ్లో 7 లక్షల 12 వేల క్యూసెక్కులుండగా...అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. 312 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గాను 300 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 45.77 టీఎంసీల సామర్థ్యం కలిగిన పులిచింతలలో... 38 టీఎంసీల మేర నీరు ఉంది. పులిచింతల ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
సాగర్‌కు కొనసాగుతున్న వరద - Nagaruja Sagar_Water level update
ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... 585 అడుగుల మేర నిల్వ చేస్తున్నారు.
![సాగర్‌కు కొనసాగుతున్న వరద](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4154761-429-4154761-1565965388652.jpg)
సాగర్‌కు కొనసాగుతున్న వరద