తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి' - ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య

సీజనల్​ వ్యాధులు రాకుండా గ్రామాల్లో ఆశావర్కర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, మంచినీరు కలుషితం కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సూచించారు.

'వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి'

By

Published : Aug 23, 2019, 6:01 PM IST

'వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి'

గ్రామ దర్శిని కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనిఖీ చేశారు. రోగులకు ఎటువంటి వసతులు కల్పించారో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలోని డాక్టర్లు, ఆశా, ఏఎన్ఎం కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రసూతి మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో ఆశా కార్యకర్తలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details