నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో పని చేసే ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. జలాశయం నిర్మాణ సమయంలో అందులో పనిచేసే ఇంజినీరింగ్, ఇతర శాఖ అధికారులకు నివాస గృహాలు నిర్మించి ఇచ్చారు. వాటిల్లో ఇప్పటికీ పలువురు ఉద్యోగులు ఉంటున్నారు. ఎన్ఎస్పీ అధికారులు పట్టించుకోకపోయిన.. సొంత ఖర్చులతో ఇళ్లను బాగుచేయిచుంకుంటూ నివాసముంటున్నారు.
ఆ ఇళ్లను తమకే కేటాయించాలని ఉద్యోగుల ఆందోళన - se employeen protest
నాగార్జునసాగర్‌లోని నివాసగృహాలను రెగ్యులరైజ్ చేసి... తమకే కేటాయించాలని ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా... ఆందోళన వివరించారు.
![ఆ ఇళ్లను తమకే కేటాయించాలని ఉద్యోగుల ఆందోళన nagarjunasagr employees protest in se office for nsp houses](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9119626-726-9119626-1602299012834.jpg)
nagarjunasagr employees protest in se office for nsp houses
ఇప్పడు నందికొండ పురపాలక సంఘంగా ఏర్పాటైన తర్వాత వాటి నిర్వహణ మున్సిపాలిటీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్యోగం చేస్తున్న 264 నివాస గృహాల్లో కొన్ని రెగ్యులరైజ్ చేశారు. మరికొన్ని మిగిలి ఉండగా... వాటిని కూడా రెగ్యులరైజ్ చేసి తాము కష్ట పడి బాగు చేసుకున్న నివాస గృహాలను తమకే కేటాయించాలని ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ఉద్యోగుల వాదనను విన్న అధికారులు.. ఉన్నతాధికారులకు తెలియజేసిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు.