నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లిలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్(Nomula bhagath) పర్యటించారు. తాటి యాదగిరి అనే రైతు తనకు ఉన్నమూడు ఎకరాల పొలంలో వరిని వెదజల్లు పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. భగత్ స్వయంగా మడిలోకి దిగి వడ్లను వెదజల్లారు.
వరి పంట సాగులో వెదజల్లు పద్ధతిని రైతులు అందరూ అలవర్చుకోవాలని కోరారు. వెదజల్లడం వల్ల అన్ని రకాలుగా రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు. కూలీల కొరత, కలుపు తీత ఖర్చులతోపాటు పెట్టుబడి కూడా తగ్గుతుందని తెలిపారు. పంట దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వెద జల్లు పద్ధతిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సీఎం కేసీఆర్ కూడా వెద జల్లు పద్ధతిలో వరి సాగు చేయాలని చెప్పారని గుర్తు చేశారు.