ప్రపంచ పర్యాటక ప్రదేశమైన నాగార్జునసాగర్ బుద్ధ వనాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సందర్శించారు. ఉదయం స్థానిక విజయ్ విహార్ చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. బుద్ధవనంలో జరుగుతున్న పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బుద్ధ వనాన్ని సందర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్
నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సందర్శించారు. విజయ్ విహార్‌కు చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలికారు.
బుద్ధ వనంను సందర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్
సందర్శనలో భాగంగా బుద్ధుని పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. బుద్ధవనంలో జాతక పార్క్, మ్యూజియంను సందర్శించారు. అనంతరం మొక్కని నాటారు. సీఎం కేసీఆర్ బుద్ధవనం ప్రాజెక్టుకు తగిన నిధులు ఇచ్చి అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ బుద్ధుడి మార్గంలో నడిచి ప్రశాంతంగా జీవితం గడపాలన్నారు.
ఇదీ చదవండి:అమెజాన్ ప్రైమ్‌కు 'వకీల్‌సాబ్' డిజిటల్ రైట్స్!