నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రారంభమైంది. లాంచీ ప్రయాణాన్ని నందికొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనూషారెడ్డి, అటవీశాఖ అధికారి సర్వేశ్వర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సాగర్ లాంచీ స్టేషన్ నుంచి 16 మంది పర్యాటకులతో శ్రీశైలానికి బయలుదేరిన లాంచీ... సాగర్ నుండి 6 గంటల పాటు సాగే ప్రయాణం సాగుతుంది. కొండల నడమ ఆహ్లదకరం సాగే ప్రయాణం సాయంత్రానికి శ్రీశైలానికి చేరుకుంటుంది.
సాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం ప్రారంభం - nagarjuna sagar latest news
నాగర్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రారంభమైంది. ఈ మేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 9: 30కు బయలు దేరిన లాంచీ.. పర్యటన పూర్తి చేసుకుని ఆదివారం సాయంత్రం 3:30 కు తిరిగి వస్తుంది.
![సాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం ప్రారంభం nagarjunasagar and srisailam lanchi journey start from today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9611410-53-9611410-1605921549545.jpg)
అక్కడి నుంచి పర్యాటక శాఖకు చెందిన బస్సుల ద్వారా పర్యాటకులకు శ్రీశైలంలోని దర్శనీయ స్థలాలను చూపి, దైవదర్శనం చేయించి రాత్రి బస కల్పిస్తారు. తిరిగి ఆదివారం ఉదయం 9:30 గంటలకు లాంచీ... శ్రీశైలం నుంచి బయలుదేరి సాయంత్రం 3:30 గంటలకు సాగర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి పర్యాటకులను బస్సు ద్వారా హైదరాబాద్‌కు తీసుకెళ్తారు.
వారంలో ప్రతి శనివారం... సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ వెళుతుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. సాగర్ నుంచి శ్రీశైలం వెళ్ళాలనుకునే వారు పర్యాటక శాఖ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్స్ పొందవచ్చని తెలిపారు.