యాసంగి పంట కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న గ్రామాలకు నీటిపారుదల శాఖ అధికారులు 6047 క్కుసెక్యూల నీటిని విడుదల చేశారు. దీనిద్వారా ఆయకట్టు పరిధిలోని మొదటి, రెండు జోన్ల పరిధిలో మొత్తం 6.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు సాగునీటి విడుదల - nalgonda district news
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో యాసంగి పంటకు అధికారులు సాగునీరు విడుదల చేశారు. ఏప్రిల్ 5వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి సరఫరా సాగుతుందని తెలిపారు.
యాసంగి పంటకు మొత్తం 55 టీఎంసీల నీరు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో ఏప్రిల్ 5వరకు అందనున్న నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే సాగర్ ఎడమ కాల్వకు వానాకాలం పంటల కోసం చివరి విడతగా నీటి విడుదల కొనసాగుతోంది.
నాగార్జునసాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు ప్రస్తుతం 299 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. ఎడమ కాలువకు 6047 క్కుసెక్యూల నీరు విడుదల చేశారు.