ఈ సీజన్లో ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు మొదలు కావడం వల్ల నాగార్జునసాగర్ జలాశయం ఆయకట్టు రైతుల్లో నీటి విడుదలపై ఆశలు పెరుగుతున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 530 అడుగులుగా ఉంది. మొత్తం నీటిమట్టం 590 అడుగులు 312.04 టీఎంసీలకు ప్రస్తుతానికి 167,75 టీఎంసీల వద్ద సాగర్ జలాశయం ఉంది. సాగర్ జలాశయంలోకి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోలు సమానంగా 500 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం అధికంగా ఉంటే ఈ సారి సాగర్ జలాశయానికి వరద తాకిడి గత ఏడాది కంటే ముందుగా రావొచ్చని నీటి పారుదలశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
సాగర్ ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు - nagarjuna sagar capacity
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు మొదలుకావడం వల్ల నీటి విడుదలపై ఆశలు చిగురిస్తున్నాయి. వరద ప్రవాహం గతేడాది కంటే ముందుగానే రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సాగర్ జలాశయంలో 40 టీఎంసీల నీరు అధికంగా ఉంది. ఎందుకంటే ఏడాది క్రితం వరదలు వచ్చి సాగర్ జలాశయం 590 అడుగులకు చేరుకున్న తరుణంలో పలు సందర్భాల్లో గేట్ల ద్వారా వరదను దిగువకు వదిలి సాగర్ కుడి ఎడమ కాల్వల ద్వారా వానాకాలం, యాసంగి పంటలకు నీరు ఇచ్చారు. ఈ సారి కూడా వానాకాలం, యాసంగి పంటలకు నీరు వస్తుందని ఆయకట్టు రైతులు ఆశిస్తున్నారు.
ఇవీ చూడండి: భారీ వర్షాలు.. కుమురం భీం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద