తెలంగాణ

telangana

ETV Bharat / state

Nagarjuna Sagar: శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. సాగర్​కు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ - లక్షకుపైగా క్యూసెక్కులు

శ్రీశైలం జలాశయం గేట్లను అధికారులు ఇవాళ సాయంత్రం ఎత్తివేయడంతో కృష్ణమ్మ సాగర్ వైపు పరుగులు తీస్తోంది. దీంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్​ జలాశయానికి ఒక్కసారిగా ఇన్​ఫ్లో పెరిగింది.

NagarjunaSagar
నాగార్జునసాగర్​ జలాశయానికి పెరిగిన ఇన్​ఫ్లో

By

Published : Jul 28, 2021, 10:20 PM IST

Updated : Jul 28, 2021, 10:33 PM IST

శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్​కు ఒక్కసారిగా ఇన్ ఫ్లో పెరిగింది. ఉదయం నుంచి 64 వేల క్యూసెక్కులున్న ఇన్ ఫ్లో ప్రస్తుతం లక్షా 25 వేల 897 క్యూసెక్కులకు చేరుకుంది. నాగార్జునసాగర్​ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 541.90 అడుగుల వద్ద ఉంది.

నాగార్జునసాగర్​

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 312.04 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం 192.30 టీఎంసీల నిల్వ ఉంది. సాగర్ నుంచి 9,064 క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 5,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... అంతే మొత్తంలో ఔట్ ఫ్లో కొనసాగుతోంది. పులిచింతల గరిష్ఠస్థాయి నీటిసామర్థ్యం 45.77 టీఎంసీలకు గానూ... ప్రస్తుతం 43.49 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మూసీ ప్రాజెక్టుకు స్వల్పస్థాయిలో కేవలం 1,167 క్యూసెక్కులు నీరు మాత్రమే వస్తోంది. మూసీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 2.95 టీఎంసీల మేర నీరు ఉంది.

శ్రీశైలం గేట్ల ఎత్తివేత

ఎగువ నుంచి భారీగా వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. జూరాల, సుంకేసుల నుంచి దాదాపు 4.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో జలశయంలో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జలాశయం గేటును 10 అడుగుల మేర పైకెత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఒక గేటు ద్వారా 20 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. అనంతరం మరో గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా రాత్రికి పదిగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు తెలిసింది.

2007 తర్వాత మళ్లీ జులైలో శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక యూనిట్‌ ద్వారా ఉత్పత్తి చేపట్టినట్లు ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీర్‌ సుధీర్‌బాబు తెలిపారు. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.5 అడుగులు ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సమాచారం తెలుసుకున్న పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు డ్యామ్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు చూసి మురిసిపోయారు. శ్రీశైలంలో జలకళతో పాటు సందర్శకుల తాకిడి పెరిగింది.

ఇదీ చూడండి:

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్​కు మొదలైన పర్యాటకుల తాకిడి..!

Last Updated : Jul 28, 2021, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details