నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీటి ప్రవాహం మరింత పెరిగింది. ప్రస్తుతం 4.13 లక్షల క్యూసెక్కుల నీరొచ్చి చేరుతోంది. 24 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.80 అడుగులకు చేరింది. జలాశయ గరిష్ఠ నీటి సామర్థ్యం 312 టీఎంసీల గాను, 311.44 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదనంతా దిగువకు విడిచిపెడుతున్నారు.
589 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టం - nagarjuna sagar water level
నాగార్జున సాగర్ జలాశయం నీటి ప్రవాహం 4 లక్షల 13వేల క్యూసెక్కులకు చేరుకుంది. జలాశయ నీటిమట్టం ప్రస్తుతం 589.80 అడుగులుగా ఉంది.
589 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టం