నాగార్జునసాగర్(nagarjuna sagar) జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు లాంచీ ప్రయాణ సేవలను నేటి నుంచి ప్రారంభించాల్సి ఉంది. సాగర్ నుంచి శ్రీశైలానికి(srisailam) జలయాత్ర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి... అనివార్య కారణాల వల్ల రద్దు చేశారు. వచ్చే నెల 4నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 4 నుంచి ప్రతి శనివారం ఈ జలయాత్ర తప్పనిసరి కాగా... 70 మంది ప్రయాణికులు ఉంటే ఏరోజైనా లాంచీ నడిపే అవకాశం ఉంది.
హైదరాబాద్-నాగార్జున సాగర్- శ్రీశైలం:
హైదరాబాద్ నుంచి వచ్చే వారికోసం ప్రతి శనివారం బస్సు ఉదయం 6గంటలకు బయలుదేరి 9 గంటల వరకు సాగర్‌కు చేరుకుంటుంది. అక్కడ అల్పాహారం అనంతరం లాంచీ శ్రీశైలానికి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుంది. అక్కడ రాత్రి భోజనం, బస ఏర్పాట్లను రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ఏర్పాటు చేస్తారు. ఉదయం శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దర్శనం అనంతరం తిరిగి లాంచీ ద్వారా బయల్దేరుతారు.
హైదరాబాద్-సాగర్-శ్రీశైలం ప్యాకేజీ వివరాలు...
- పెద్దలు: రూ.3,999
- పిల్లలు: రూ.3,200
సాగర్ టు శ్రీశైలం(ఒకేసారి):
- పెద్దలు: రూ.1,499
- పిల్లలు: రూ.1,199
సాగర్ టు శ్రీశైలం+ శ్రీశైలం టు సాగర్
- పెద్దలు: రూ.2,499
- పిల్లలు: రూ.1999