తెలంగాణ

telangana

ETV Bharat / state

sagar gates: నాగార్జున సాగర్ గేట్లకు కొత్త ఇనుప తాళ్లు..

sagar gates: వర్షాకాలం వరద ప్రభావాన్ని తట్టుకునేలా నాగార్జున సాగర్​ జలాశయం వద్ద అధికారులు చర్యలు చేపట్టారు. గేట్లకు ఉన్న పాత ఇనుప తాళ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. వరద మొదలు కాకముందే గేట్ల పనితీరును పరిశీలించాలని అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

sagar gates
నాగార్జున సాగర్ గేట్లకు కొత్త ఇనుప తాళ్లు..

By

Published : Jul 14, 2022, 9:57 AM IST

sagar gates: నాగార్జున సాగర్ జలాశయానికి రాబోయే రోజుల్లో వరద ప్రవాహాన్ని ఊహించిన ఎన్నెస్పీ(నాగార్జున సాగర్ ప్రాజెక్ట్) అధికారులు జలాశయం నిర్వహణ పనులను వేగవంతం చేశారు. ప్రాజెక్ట్​కు ఉన్న 26 క్రస్ట్ గేట్ల ఇనుప తాళ్లను రూ.77 లక్షల వ్యయంతో పాత వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్తవి బిగిస్తున్నారు. ఎగువ నుండి నీటి ప్రవాహం రాక ముందే ఈ పనులు పూర్తి చేయడం కోసం రోజుకు రెండు గేట్ల చొప్పున పని పూర్తి చేస్తున్నారు.

నాగార్జున సాగర్ గేట్లకు కొత్త ఇనుప తాళ్లు..

గత ఏడాది రూ.3 లక్షల వ్యయంతో క్రస్ట్ గేట్లకు గ్రీజింగ్ పనులు, గేట్ల నుండి నీరు లీకేజీ లేకుండా రబ్బర్ సీళ్లు బిగించినట్లు ఎన్నెస్పీ అధికారులు పేర్కొన్నారు. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 528.30 ఆడుగులు గా ఉంది మొత్తం 312.04 టీఎంసీల సామర్థ్యం కాగా ప్రస్తుతం 164.84 టీఎంసీ లు గా ఉంది ఎగువ నుండి సాగర్ జలాశయంలోకి 1098 క్యూసెక్కుల మాత్రమే వస్తుంది. సాగర్ నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 1065 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది.

నాగార్జున సాగర్ గేట్లకు కొత్త ఇనుప తాళ్లు..

అయితే రాబోయే రోజుల్లో ఇన్​ఫ్లో భారీగా పెరిగే అవకాశముందని అధికారులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలంకు జూరాల, తుంగభద్ర నుంచి 2లక్షల క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. సాయంత్రం వరకు శ్రీశైలంకు వరద తాకిడి మొదలవుతుంది. శ్రీశైలం నిండిన తరువాత ఆ నీటిని సాగర్​కే పంపుతారు. ఆ లోపే ఇనుప తాళ్లను బిగించి గేట్లను సిద్ధం చేయాలని అధికారులు వేగంగా పనులు చేపట్టారు.

నాగార్జున సాగర్ గేట్లకు కొత్త ఇనుప తాళ్లు..

ABOUT THE AUTHOR

...view details