నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల భగత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి కేసీఆర్‌ను కలిశారు. కుటుంబ సభ్యులతో సహా ప్రగతిభవన్‌కు వెళ్లిన భగత్.. సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా భగత్ కుటుంబ సభ్యులతో.. కేసీఆర్ సరదాగా ముచ్చటించారు. నోముల నర్సింహయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నట్లు సమాచారం. అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.