నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడం వల్ల క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ఈ రోజు ఉదయం వరకు 4గేట్లు తెరిచి ఉండగా.. వరద తగ్గడం వల్ల నీటి విడుదలను నిలిపివేశారు. సాగర్ జలాశయానికి ఎగువ నుంచి ప్రస్తుతం 46 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం మాత్రమే వస్తోంది. జలాశయం నుంచి కుడి,ఎడమ కాలువల ద్వారా, ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్‌కు తగ్గిన వరద... గేట్లు మూసివేత
నాగార్జున జలాశయానికి వరద తగ్గుముఖం పట్టడం వల్ల క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం సాగర్‌కు 46వేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తోందని అధికారులు తెలిపారు.
నాగార్జున సాగర్‌కు తగ్గిన వరద... గేట్లు మూసివేత
సాగర్ మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 589.60 అడగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312 .04 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 310.84టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. సాగర్ జలాశయానికి ఈ సారి భారీగా వరద రావడం వల్ల గత నెల 11 నుంచి వరదను దిగువకు విడుదల చేస్తూనే ఉన్నారు.
ఇవీ చూడండి: కేంద్రాన్ని నిలదీయడానికి వెనకాడం: సీఎం కేసీఆర్