Nagarjuna Sagar Dam Farmers Issue :నల్గొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో వరిసాగు పూర్తిగా తగ్గిపోయింది. బోర్లు ఉన్న రైతులు మాత్రమే కొద్దిపాటి భూమిలో వరి సాగు చేస్తున్నారు. సాగర్ నుంచి నీరందక వర్షాల్లేక సాగు చేయలేని పరిస్థితి నెలకొంది.
No Water in Nagarjuna Sagar Dam :గిట్టుబాటు ధర దక్కక ఓ పక్క అల్లాడుతున్న రైతులన రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలాలు కోలుకోలేకుండా చేస్తున్నాయి. వేలకు వేలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం కష్టపడినా చివరకు పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు బావురుమంటున్నారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
"సాగర్ ఎడమ కాలువకు నీరు వదల లేదు. దీంతో ఎకరానికి 6000 -7000 రూపాయలు వానాకాలంలో నష్టపోయాం. యాసంగి పంటనైనా నీరు వస్తుందని ఆశగా ఎదురుచూశాం. సాగర్లో నీరు లేదు. ఉన్న నీరు తాగు నీటికి వదిలిపెట్టారు. దానివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. కొత్త ప్రభుత్వం దున్నడానికో, వడ్లు పోసిన దానికి పరిహారంగా నో ఎకరానికి ఎంతో కొంత ఇవ్వాలి."-రైతులు
సాగర్ ఆయకట్టులో యాసంగి ఆశలు ఆవిరి - ఖమ్మం జిల్లాలో అగమ్యగోచరంగా సాగు పరిస్థితి
"మాకు ఇక్కడ ఎకరం భూమి ఉంది. నీళ్ల కోసం మా పొలంలో బోరు వేసినా పడలేదు. సాగు చేసుకోవడానికి సాగర్ కాలువ ద్వారా నీటి మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు కాలువ నీళ్లు కూడా రావడం లేదు. రెండు సార్లు నారు వేశాం సాగునీరు పంటకు అందకపోతే పంట పండించడం కష్టం. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి."-రైతులు