ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1లక్ష 55 వేల, 529 క్యూసెక్కులు కొనసాగుతోంది. అంతే మొత్తంలో 10 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేయగా... పులిచింతల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.
నాగార్జునసాగర్ జలాశయం 10 గేట్ల ద్వారా 1లక్ష 19 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయగా... సాగర్ కాల్వకు 8వేల క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 1800, లో లెవెల్ కాల్వకు 300, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.