నాగార్జుసాగర్ నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తివేత - nagarjuna sagar news today
నాగార్జునసాగర్ జలాశయం నిండు కుండను తలపిస్తోంది. జలాశయం నీటి మట్టం పూర్తిస్థాయి నీటి మట్టానికి సమీపంలో ఉన్నందున నాలుగు క్రస్ట్ గేట్లు తెరిచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.
నాగార్జుసాగర్ నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 54వేల క్యూసెక్కులు రాగా.. సాగర్ నీటిమట్టం పూర్తిస్థాయి నీటి మట్టానికి(590 అడుగులు) చేరువైంది. అప్రమత్తమైన అధికారులు జలాశయం నాలుగు క్రస్ట్ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
- ఇదీ చూడండి : ఆర్టీసీ డ్రైవర్ బాబుకు పలువురు నేతల నివాళి