తెలంగాణ

telangana

ETV Bharat / state

nagarjuna sagar gates open: 5 అడుగుల మేర 4 క్రస్ట్ గేట్ల ఎత్తివేత - తెలంగాణ టాప్ న్యూస్

నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. వెంటనే స్పందించిన అధికారులు 4 క్రస్ట్ గేట్లను 5 అడగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

nagarjuna-sagar-dam-four-crust-gates-are-lifted
5 అడుగుల మేర 4 క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారులు

By

Published : Aug 8, 2021, 2:50 PM IST

నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరదలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సాగర్ జలాశయంలో నీరు పెరగడంతో 4 క్రస్ట్ గేట్లను 5 అడగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి 75 వేల 555 క్యూసెక్కులుక్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండగా... 75, 555 క్యూసెక్కుల నీటిని స్పిల్ వే ద్వారా విడుదల చేస్తున్నారు.

సాగర్ జలాశయం ఎడమ కాలువకు 8 వేల క్యూసెక్కుల నీరు, ఎమ్మార్పీ 1800 క్యూసెక్కుల నీరు, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32వేల 400 క్యూసెక్కుల నీరు రాగా.... మొత్తం 75 వేల క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లో గా విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి నిన్నటి వరకు ఇన్ ఫ్లో తక్కువగా ఉండడంతో గేట్లను మూసి వేసిన అధికారులు.. వరద ప్రవాహం పెరగడంతో మళ్లీ ఈరోజు ఉదయం 2 గేట్లను ఎత్తారు. ఆ తర్వాత మరో రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వెంటనే స్పందించిన అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 311.74 టీఎంసీల వరకు నిల్వ ఉంది.

ఇదీ చూడండి:ఆ తోటలో వంద రకాల పండ్ల చెట్లున్నాయి.. మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details