భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. గంటగంటకు ఇన్‌ఫ్లో పెరుగుతున్నందున శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇదే బాటలో నాగార్జుసాగర్లోనూ 4 క్రస్ట్ గేట్లు ఎత్తి 29వేల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు.
నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు - Nagarjuna Sagar Dam four gates opened
ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వరద ఉద్ధృతి కొనసాగుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులో.. 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
![నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు nagarjuna-sagar-dam-four-crust-gates-are-lifted](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8502616-19-8502616-1597997876869.jpg)
నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు
ప్రస్తుతం నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 3,95,269 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 29,712 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు.. ప్రస్తుతం 583.20 అడుగులకు నీటిమట్టం చేరింది. సాగర్ పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 312.04 టీఎంసీలకు కాగా.. ప్రస్తుతం 289.36 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు
Last Updated : Aug 21, 2020, 2:07 PM IST