నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్ జలాశయానికి 3 లక్షల 48 వేల క్యూసెక్కుల నీరు రావడంతో సాగర్ 18 క్రస్ట్ గేట్లను ఎత్తి 3 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని స్పిల్ వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు మొత్తం ఇన్ ఫ్లో 3,48,518 క్యూసెక్కుల వరద రావడంతో అంతే మొత్తంలో ఔట్ ఫ్లోగా వెళ్తోంది.
సాగర్ 18 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. 18 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేస్తున్నారు.
nagarjuna sagar
నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం 590 అడుగులకు గానూ 589.90 అడుగులకు చేరింది. 18 క్రస్ట్ గేట్లలో 6 గేట్లు 15 అడుగులు, 12 గేట్లు 10 అడుగుల మేరకు ఎత్తి వరదనీరు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి:'మొత్తం పరిశీలన పూర్తయ్యాకే సంతృప్తి చెందానా లేదా చెప్తా...'