నాగార్జున సాగర్ జలాశయానికి పైనుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి ప్రవాహం పెరగడం వల్ల 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 22 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని.... కుడి, ఎడమ కాల్వల ద్వారా 17వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా సాగర్ నుంచి లక్షా 52 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.
Nagarjuna Sagar Dam : సాగర్‌కు పెరిగిన ప్రవాహం.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల - nagarjuna sagar dam gates lifted
ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. తెల్లవారుజాము నుంచి వరద పెరగడం వల్ల అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు.
Nagarjuna Sagar Dam
నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ.... ప్రస్తుతం 589.90 అడుగుల నీటిమట్టం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.... 311.74 టీఎంసీల నీరు ఉంది.