నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ భాజపా ఇంఛార్జ్ కంకణాల నివేదిత నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. శుక్రవారం మంచి రోజు కావడం.. తనకే టికెట్ వస్తుందనే ఆశాభావంతో నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. అంతిమంగా పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
నామినేషన్ దాఖలుచేసిన నివేదిత: 'పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటా' - తెలంగాణ వార్తలు
నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం భాజపా నియోజకవర్గ ఇంఛార్జ్ కంకణాల నివేదిత నామినేషన్ దాఖలు చేశారు. మంచి రోజు కావడం వల్లే శుక్రవారం నామినేషన్ వేశానని.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

భాజపా నియోజకవర్గ ఇంఛార్జి నివేదిత నామినేషన్, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తాజా వార్తలు
తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని.. భాజపా తననే ప్రకటిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. నాల్గో రోజు 8మంది అభ్యర్థులు 12 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 20 మంది అభ్యర్థులు 25 నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి:'పరీక్షలు లేకుండా పాస్ చేయలేం.. రెండ్రోజుల్లో హాల్ టికెట్లు'