ఓటు వేసే ప్రతి ఒక్కరికి గ్లవ్స్ అందించడంతో పాటు పోలింగ్ గదిలో శానిటైజర్ అందుబాటులో ఉంచి... నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో... ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ కొన్ని చోట్ల ఆలస్యమైంది. గుర్రంపోడు మండలం వట్టికోడులోని ఒక బూత్‌లో ఓటింగ్ యంత్రం పనిచేయలేదు. సాంకేతిక సిబ్బంది వచ్చి సరిచేసేసరికి... గంటా 15 నిమిషాలు పట్టింది. నిడమనూరులోని 201/ఏ కేంద్రంలో ఈవీఎంలో సమస్యతో 7 గంటల 56 నిమిషాలకు ఓటర్లను అనుమతించారు.
పోలింగ్‌లో జాప్యం
త్రిపురారంలోని 265 బూత్‌లో 20 నిమిషాలు ఆలస్యమైంది. ఏజెంట్లు సమయానికి రాలేదని అధికారులు, సిబ్బంది సీళ్లు తెరవకపోవడం వల్లే పోలింగ్‌లో జాప్యం నెలకొందని ఏజెంట్లు అన్నారు. మాడుగులపల్లి మండలం అభంగాపురంలోనూ ఈవీఎంలలో సాంకేతిక సమస్య ఏర్పడింది. తిరుమలగిరి సాగర్ మండలం తూటిపేట తండాలో ఈవీఎం మొరాయించడం వల్ల అరగంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. ఓటింగ్ యంత్రాల్లో సమస్యల వల్ల ప్రజలు ఉదయం నుంచి పడిగాపులు పడాల్సి వచ్చింది.
3గంటల వరకు 69 శాతం