ప్రజాక్షేత్రంలో చెమటోడ్చుతున్న అభ్యర్థులు నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పాగా వేయాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్న తెరాస... పక్కా వ్యూహాలతో ముందుకెళుతోంది. పెద్దవూర మండలం తెప్పలమడుగులో నోముల భగత్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓట్లు అభ్యర్థించారు. ఏడేళ్లలో ప్రభుత్వం చేసిన పనులను వివరించిన మంత్రి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మాడుగులపల్లి మండలం కన్నెకల్‌లో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డిలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
ఒక్క అవకాశం ఇవ్వండి..
గుర్రంపోడు మండలం తేనేపల్లి తండాలో... భాజపా అభ్యర్థి రవి కుమార్ ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. తెరాస, కాంగ్రెస్ వల్ల జరిగిన అభివృద్ధి శూన్యమని ఎన్నికలో భాజపాను గెలిపించాలని కోరారు. ఒక్కసారి అవకాశం ఇస్తే సాగర్‌ను అభివృద్ధి చేసి చూపిస్తానని వెల్లడించారు.
నిడమనూరులో తెదేపా
నిడమనూరు మండలంలోని గ్రామాల్లో తెలుగుదేశం అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు హయాంలోనే సాగర్ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. తుమ్మడంలో వివిధ పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు.
ఇదీ చూడండి:ముఖ్యమంత్రి కేసీఆర్‌ది తానీషాను తలపించే పాలన: తరుణ్‌చుగ్