పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ... నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. గ్రామ గ్రామాల్లో పర్యటించి ఓటర్లను కలుసుకుంటున్నారు. ఉప ఎన్నికలో తమ పార్టీనే గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తెరాస... నోముల భగత్‌కు పట్టం కట్టాలంటూ ప్రచారం చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి... నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెద్దవుర మండలంలో నోముల భగత్‌తోపాటు విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తెరాసనే గెలిపించాలని ఓటర్లకు విన్నవించుకున్నారు.
హామీలు నెరవేరుస్తాం
త్రిపురారం మండలంలో నోముల భగత్‌కు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిని కోరుకునే నర్సింహయ్య ఆశయాలను కొనసాగించేలా... ఉపఎన్నికలో భగత్‌ను గెలిపించాలని తలసాని కోరారు. తెరాస ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొన్నారు.