నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం నాడు ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ఇద్దరు ఇంతకు ముందే ఒక్కో సెట్ చొప్పున అందజేయగా... ఇవాళ మరోసారి దాఖలు చేశారు. నాలుగో రోజు ఎనిమిది మంది అభ్యర్థులు... 10 సెట్ల పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
సాగర్ ఉపపోరు: నాలుగు రోజుల్లో 20మంది.. 23 నామినేషన్లు - తెలంగాణ వార్తలు
సాగర్ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాలుగో రోజు ఎనిమిది మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు. వారిలో ఇద్దరు ఇదివరకే ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు రోజుల్లో మొత్తం 20 మంది అభ్యర్థులు... 23 సెట్లను సమర్పించారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్లు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక తాజా వార్తలు
ఈ నెల 23 నుంచి ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు... 23 సెట్లను సమర్పించారు. భాజపా తమ అభ్యర్థి పేరును ప్రకటించకముందే... ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కంకణాల నివేదిత అనూహ్యంగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు నామపత్రాలు అందజేసిన వారిలో ఏడుగురు వివిధ పార్టీలకు చెందినవారు కాగా... 13 మంది స్వతంత్రులున్నారు.
ఇదీ చదవండి: